
అలా సుమారుగా రెండేళ్లుగా ఈమె బెడ్ కే పరిమితం అయ్యింది. ఈ విషయాన్ని కూడా చాలా ఆలస్యంగానే తెలియజేసింది నభా నటేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో మొదటిసారిగా తెలుగు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత నటించాల్సిన సినిమాలన్నీ ఫెయిల్యూర్ గా మిగలడంతో చివరిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వరస సినిమా అవకాశాలు అందుకున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో నభా నటేష్ చాలా తీవ్రంగా గాయపడిందట. దీంతో ఈమె రెండేళ్ల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కోలుకున్నప్పటికీ కూడ అవకాశాలు మాత్రం రావడం లేదట. మొన్నమధ్య డార్లింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం అయితే స్వయంభు అనే సినిమాలో నటిస్తోంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గానే ఉంటూ తన క్రియేషన్ పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది నభా నటేష్. నిరంతరం హాట్ ఫోటోషూట్లతో చీర కట్టులో తన అందాలను చూపిస్తూ క్రేజ్ పెంచుకోవడానికి మరింత ప్రయత్నాలు చేస్తూనే ఉన్న అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు.