సెలబ్రిటీలపై ఎన్నో ఆరోపణలు చేస్తూ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యే పనిలో పడ్డారు డైరెక్టర్ గీతాకృష్ణ.ఒకప్పుడు మంచి సినిమాలు తీసి డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన ఈయన హీరో హీరోయిన్లు ఎవరు అవకాశాలు ఇవ్వకపోవడంతో చివరికి సెలబ్రిటీల మీద పడ్డారు.అయితే ఆయన ఎందుకు అలా సెలబ్రిటీల గురించి ఆరోపణలు చేస్తున్నారో తెలియదు కానీ ఈయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి.అంతే కాదు కొంతమంది సెలబ్రిటీల ఫ్యాన్స్ మాత్రం ఆయనపై చాలా విమర్శలు చేస్తున్నారు.అయితే ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్లు మొదలు హీరో హీరోయిన్లు నిర్మాత డైరెక్టర్లు ఇలా ఎవరిని వదలకుండా వారి ప్రొఫెషనల్ లైఫ్ పై, పర్సనల్ లైఫ్ పై సంచలన కామెంట్లు చేస్తున్న గీత కృష్ణ తాజాగా స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పై షాకింగ్ కామెంట్లు చేశారు.అసలు ఆయనకు తెలుగే రాదు.కానీ లక్షల దొబ్బేస్తున్నాడు అంటూ గీత కృష్ణ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఇంతకీ సిద్ శ్రీరామ్ గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. 

యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతాకృష్ణ మాట్లాడుతూ.. ఎక్కడో అమెరికాలో ఉన్న సిద్ శ్రీరామ్ కి తెలుగువారే అవకాశం ఇస్తారు. కానీ తెలుగులో ఉండే సింగర్స్ ని మాత్రం ఎంకరేజ్ చేయరు. ఒకవేళ వాళ్ళు ఇండస్ట్రీలో రాణిద్దాం అనుకున్నా కూడా కొంతమంది వారిని తొక్కేస్తారు. యూఎస్ లో ఉండే సిద్ శ్రీరామ్ కి తెలుగు కూడా సరిగ్గా రాదు. తెలుగు పాటలు కూడా సరిగ్గా పాట రాదు. తెలుగు పదాలే పలకరాని వాడికి లక్షల రెమ్యూనరేషన్ లు ఇస్తూ ఫేమస్ చేస్తున్నారు.కానీ తెలుగు వారికి అన్యాయం చేస్తున్నారు.సిద్ శ్రీరామ్ యూఎస్ నుండి వచ్చి తెలుగు పదాలు సరిగ్గా పలక రాకపోయినా పాటలు పాడరాకపోయినా ఒక్కో పాటకు 10 లక్షలు తీసుకొని ఒకేసారి పది పాటలు పాడి వెళ్లిపోతాడు.అలా తెలుగు రాకపోయినా కూడా లక్షలు దొబ్బేస్తున్నాడు. ఇక ఇలాంటి వారి గురించి చనిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం చాలాసార్లు బాధపడ్డారు. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ గురించి పరోక్షంగా నా దగ్గర మాట్లాడుతూ ఇలాంటి వారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తారో అర్థం అవ్వడం లేదు.

తెలుగు కూడా సరిగ్గా రాదు అని నా దగ్గర చెప్పుకొని బాధపడ్డారు. అయితే ఇప్పుడు ఉండే యూత్ కి తెలుగు పదాలు కూడా సరిగ్గా పలకడానికి రాని సింగర్స్ పాడే పాటలే నచ్చుతున్నాయి. ఇదే లేటెస్ట్ ట్రెండ్ కావచ్చు అంటూ గీతా కృష్ణ సిద్ శ్రీరామ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సిధ్ శ్రీ రామ్ పై గీత కృష్ణ చేసిన కామెంట్లకు ఏమాత్రం పొంతనలేదు.ఎందుకంటే సిధ్ద్ శ్రీరామ్ తెలుగులో ఎన్నో పాటలు పాడి ఫేమస్ అయ్యారు.అలా ఈయన పాడిన అల వైకుంటపురంలోని సామజ వర గమనా పాట ఇప్పటికీ శ్రోతలకు వినసొంపుగా ఉంటుంది. అలాగే వకీల్ సాబ్లోని మగువ మగువా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలోని నీలి నీలి ఆకాశం, నిన్ను కోరి మూవీ లోని అడిగా అడిగా, గీత గోవిందం లో ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి వంటి పాటలు చాలా పాపులర్ అయ్యాయి

మరింత సమాచారం తెలుసుకోండి: