పవన్ కళ్యాణ్ ..టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు . మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరు చెప్తే జనాలకి ఏ టైప్ అఫ్ పూనకాలు వస్తాయి అనే దాని గురించి సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . పవన్ కళ్యాణ్  లాంటి హీరోలు ఇండస్ట్రీలో చాలా రేర్ గా ఉంటారు . అది అందరికీ తెలిసిన విషయమే . ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ప్రజా సేవ చేస్తూ తనదైన స్టైల్ లో పాలిటిక్స్ లోను నెంబర్ వన్ గా ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యే ఒకే ఒక్క అంశం మూడు పెళ్లిళ్లు . ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్న కారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోలింగ్కి గురవుతూనే ఉంటాడు .


కాగా పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చేసి మరి అన్నా లెజినోవా ని పెళ్లి చేసుకున్నారు . అన్నా లెజినోవా-పవన్ కళ్యాణ్ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్తుంది . కాగా అన్నాలెజినోవా ఈ మధ్యనే గుండు కొట్టించుకొని తన కొడుకు మార్క్ శంకర్ పేరిట 17 లక్షలు టిటిడి కి విరాళంగా ఇచ్చింది.  ఈ క్రమంలోనే అన్నాలెజినోవాకి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా అన్నాలెజినోవా - పవన్ కళ్యాణ్ రిలేషన్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది .



పవన్ కళ్యాణ్ చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు . మరి అలాంటి పవన్ కళ్యాణ్ ని అన్నాలెజినోవా ఏమని పిలుస్తుంది? సాధారణంగా ఇండియన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏవండి.. శ్రీవారు ఇలా పిలుస్తూ ఉంటారు . అయితే అన్నాలెజినోవా ఫారెన్ అమ్మాయి . మరి తెలుగు సాంప్రదాయాలను గౌరవిస్తుందా..? అనే అనుమానం అందరికీ ఉంది . అయితే పవన్ కళ్యాణ్ ఇష్టపడినప్పటి నుంచి ఆమె తెలుగు సంప్రదాయాలను లైక్ చేయడం ఫాలో అవ్వడం ప్రారంభించిందట . పవన్ కళ్యాణ్ ని ఆమె కళ్యాణ్ గారు అంటూ అని చాలా గౌరవిస్తూ పిలుస్తుందట.  సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నాలెజినోవా ని అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: