హీరోయిన్ త్రిష  సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం దాటింది. ఇంకా సినిమాల్లో దూసుకుపోతూనే ఉంది. ఈమె తోటి హీరోయిన్స్ అంతా పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. కానీ త్రిష మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా సినిమా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ  ఎంత వయసు పెరిగినా కానీ అందం విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, కన్నడ ఇలా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈమె  కెరియర్ లో ఎంతో బాగా సెట్ అయిన కానీ పెళ్లి విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేసింది. త్రిష  ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో ఎఫైర్స్ నడిపిందట. వారిని పెళ్లి కూడా చేసుకోవాలనుకుందట. మరి ఆ హీరోలు ఎవరో ఆ వివరాలు చూద్దాం.. 

త్రిష తెలుగు ఇండస్ట్రీలోకి ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమా ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్ బాగా సెట్ అయింది. వర్షం సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని  అప్పట్లో వార్తలు వచ్చాయి. అలా త్రిష మొదటగా ప్రభాస్ తో డేటింగ్ చేసి ఆ తర్వాత కాస్త దూరమైపోయింది. ఈయన తర్వాత తమిళ హీరో విజయ్ దళపతి తో త్రిష ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈయనతో చాలా చిత్రాల్లో నటించింది త్రిష. ఈ మధ్యకాలంలో విజయ్ దళపతి తమిళ్లో ఒక పార్టీ కూడా పెట్టాడు. ఈ క్రమంలోనే త్రిష కూడా నేను రాజకీయాల్లోకి వెళ్తానని ముఖ్యమంత్రి అవుతానని చెప్పింది.

ఈ విధంగా విజయ్ దళపతి తో ఇంకా ఈమె ప్రేమాయణం నడిపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్రిష,రానా దగ్గుబాటి తో కూడా ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక ఈయనే కాకుండా త్రిష హీరో ధనుష్, శింబు  లతో కూడా ప్రేమయాణం నడిపిందని, వీరితో చాలా కాలం చెట్టాపట్టాలేసుకొని తిరిగిందనే వార్తలు వినిపించాయి. ఈ విధంగా త్రిష పలువురు హీరోలతో డేటింగ్ చేసి  పెళ్లి విషయంలో వెనకడుగు వేసిందని చెప్పవచ్చు. అలాగే వ్యాపారవేత్త వరుణ్ మానీయన్ తో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాక ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి: