చిరంజీవి పరువు బాలకృష్ణ తీయడం ఏంటి.. ఇంతకీ బాలకృష్ణ చిరంజీవి గురించి తప్పుగా ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.. రీసెంట్ గా బాలకృష్ణకి పద్మ భూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే పద్మభూషణ్ రావడంతో ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్న హిందూపురం ప్రజలు పౌర సన్మానం చేశారు. ఇక ఈ ఈవెంట్లో భాగంగా బాలకృష్ణ స్టేజ్ మీద మాట్లాడుతూ.. చరిత్ర సృష్టించాలన్నా నేనే.. చరిత్ర తిరగరాయాలన్నా నేనే..అదే నా సంతకం.. అదే నా నినాదం.. నన్ను చూసి చాలా మంది పొగరు అంటారు. కానీ నాకు నిజంగానే పొగరు ఉంటుంది.అది కూడా నన్ను చూసుకొని నాకే పొగరు..మా నాన్నగారు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చి స్టార్ అయ్యారు. నేను కూడా అలాగే చేశాను. మా నాన్నగారు పోషించని పాత్రలు కూడా పోషించాను. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఆయన చేయాలనుకున్నారు. 

కానీ నేను చేశాను. 50 ఏళ్లు హీరోగా ఉండడం ఎవరి తరం కాదు.కానీ నేను ఆ ఘనత సాధించాను. చాలామంది హీరోలు 50 ఏళ్ల వరకు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగలేరు. మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. ఈ క్రెడిట్ నాకు మాత్రమే సొంతం.. సినిమాలు చేస్తూనే ఎమ్మెల్యేగా మూడుసార్లు హిందూపురంలో గెలిచాను. హ్యాట్రిక్ కొట్టాను. ఎమ్మెల్యేగా నా భాద్యతలు  స్వీకరిస్తూనే సినిమాలు కూడా కొనసాగిస్తున్నాను.నా రెండో పుట్టినిల్లు హిందూపురం.చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చి నామరూపల్లేకుండా పోయారు.కానీ నేను వారిలాగా కాదు సమాజానికి సేవ చేయాలి అనే బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే పద్మభూషణ్ నాకు ఎప్పుడో రావాల్సిందని చాలామంది అన్నారు.కానీ నాకు సరైన సమయంలోనే ఈ అవార్డు వచ్చింది.

మా నాన్నగారికి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వడమే తెలుగు వారందరి కల. ఇది త్వరలోనే నెరవేరుతుంది.ఆయనకు భారతరత్న ఇస్తేనే మా నాన్నగారికి సరైన గౌరవం దక్కుతుంది అంటూ బాలకృష్ణ హిందూపురం ఈవెంట్లో ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ బాలకృష్ణ మాట్లాడిన మాటలు మాత్రం కొంతమంది మెగా ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఎందుకంటే బాలకృష్ణ ఆ ఈవెంట్లో కొంతమంది నటులు రాజకీయాల్లోకి వచ్చి నామరూపాల్లేకుండా పోయారు అంటూ మాట్లాడారు.అది మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించే అన్నారని, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరిగి కాంగ్రెస్లో కలిపేసారనే ఉద్దేశంతోనే అలా మాట్లాడారని బాలకృష్ణ చిరంజీవిని అవమానించారంటూ కొంతమంది కొత్త వివాదాన్ని తెరమీద వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై మెగా ఫ్యాన్స్ ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: