తమిళ నటుడు సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు సూర్య నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అలా సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూర్య కు మంచి గుర్తింపు ఏర్పడింది. దానితో సూర్య నటించిన సినిమాలు తెలుగులో కూడా మంచి అంచనాల నడుమ విడుదల అవుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా సూర్య , కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రేట్రో అనే మూవీ లో హీరో గా నటించాడు. పూజ హెగ్డేమూవీ లో హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాను రెట్రో అనే టైటిల్ తోనే తెలుగులో కూడా విడుదల చేశారు. మరి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 3 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 3 రోజుల్లో నైజాం ఏరియాలో 98 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 31 లక్షలు , ఆంధ్ర లో 1.5 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 3 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.44 కోట్ల షేర్ ... 4.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ పై మొదటి నుండి తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 10.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 8.06 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లయితే హిట్టు స్టేటస్ను అందుకుంటుంది. ప్రస్తుతం రెట్రో మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్లు రావడం లేదు. దానితో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో హిట్ స్టేటస్ అందుకోవడం కాస్త కష్టం గానే కనబడుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: