తాజాగా నాని హీరోగా రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఇక ఈ సినిమా విడుదల అయిన మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. దానితో మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన మీడియం రేంజ్ మూవీ లిస్టులో హిట్ ది థర్డ్ కేస్ మూవీ అద్భుతమైన స్థానాన్ని దక్కించుకుంది. మరి హిట్ 3 మూవీ విడుదల అయిన మూడవ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన మీడియం రేంజ్ హీరోల మూవీలలో ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

విడుదల అయిన మూడవ రోజు మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమాల లిస్టులో తండెల్ మూవీ 8.40 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా ... ఆ తర్వాత ఉప్పెన మూవీ 8.26 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , టిల్లు స్క్వేర్ మూవీ 7.44 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలోనూ , దసరా సినిమా 6.73 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలోనూ , మ్యాడ్ స్క్వేర్ మూవీ 5.88 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానం లోనూ , విరూపాక్ష మూవీ 5.77 కోట్ల కలెక్షన్లతో 6 వ స్థానంలోనూ , హనుమాన్ సినిమా 5.70 కోట్ల కలెక్షన్లతో 7 వ స్థానంలోనూ , ఖుషి మూవీ 5.68 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక తాజాగా నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ 5.50 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: