తాజాగా నందమూరి బాలకృష్ణ పై ఓ దర్శకుడు చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అభిమానులకి కోపం పుట్టిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. నందమూరి బాలకృష్ణ గురించి ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.. నందమూరి బాలకృష్ణ ఓ పెద్ద సైకో అని.. గదిలోకి పిలిచి అలా చేస్తారు.. అంటూ డైరెక్టర్ గీతా కృష్ణ ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణపై విమర్శలు చేశారు. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలకృష్ణ మెంటాలిటీ ఒకప్పుడు బానే ఉండేది. కానీ ఇప్పుడు వేరేలా మారిపోయింది. ఆయన సైకోలా తయారయ్యారు.ఎవరైనా షూటింగ్ లో ఉన్నవాళ్లు ఆయన్ని చూసి నవ్వినట్టు కనిపిస్తే వెంటనే వాళ్ళని తన రూమ్ లోకి పిలిపించుకొని మరీ తిట్టి కొడతారు.ఆయన సైకోలాగే బిహేవ్ చేస్తున్నారు. 

బాలకృష్ణ కే. విశ్వనాథ్ గారితో చేసిన జనని జన్మభూమి సినిమా సమయంలో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఆ సమయంలో నాతో బాలకృష్ణ గారు చాలా బాగా మాట్లాడారు.క్లోజ్ గా కలిసిపోయారు. కానీ ఇప్పుడు బాలకృష్ణ మెంటాలిటీ మారిపోయింది.సైకోలాగే తయారయ్యారు.. అంటూ బాలకృష్ణపై సంచలన కామెంట్లు చేశారు గీతాకృష్ణ. బాలకృష్ణకి పద్మభూషణ్ వచ్చిన వేళ గీతా కృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. అంతేకాదు ఈయన చేసిన కామెంట్లపై నందమూరి బాలకృష్ణ అభిమానులు గుర్రుగా ఉన్నారు.

నందమూరి బాలకృష్ణ వీరాభిమానులైతే గీతాకృష్ణ బయట కనిపిస్తే ముసుగు వేసి మరీ కొడదాం అనే లెవెల్ లో కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ ఇలాంటి ఆరోపణలు ఎన్నోసార్లు ఎదుర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు బాలకృష్ణపై చాలామంది ఇలాంటి ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గానే బాలకృష్ణ పద్మభూషణ్ అందుకోవడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన హిందూపురంలో పౌర సన్మానం చేశారు. ఇక ఈ ఈవెంట్ లో కూడా బాలకృష్ణ ఎన్నో హాట్ కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: