సూపర్ స్టార్ రజనీకాంత్ అటు తెలుగు ప్రేక్షకులకు, తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. రజనీకాంత్ కి ఉన్న క్రేజీ ఆయన సినిమాల రికార్డుల, కలెక్షన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చివరిగా వెట్టయాన్ అనే సినిమా తప్ప ప్రేక్షకులను బాగా అలరించిన రజనీకాంత్ ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూలీ సినిమాతో పాటుగా జైలర్ 2 సినిమాలో నటిస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఒక సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. కూలి చిత్రంలో భారీతారాగణం కూడా నటిస్తూ ఉన్నది.గత కొద్ది రోజులుగా కోలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.


దీంతో ఆయన అభిమానుల సైతం ఆందోళన పడుతూ ఉన్నారు.ఈ విషయం పైన రజనీకాంత్ భార్య సుమలత క్లారిటీ ఇస్తు తెలియజేసింది. ఇటీవలే రజనీకాంత్ భార్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీ భర్త సినిమాల నుంచి విరామం తీసుకోబోతున్నారనే ఆలోచనలో ఏమైనా ఉన్నారా అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా?. ఆ విషయం నాకు తెలిస్తే ఖచ్చితంగా మీతోనే చెబుతాను అంటూ తెలియజేసింది భార్య సుమలత. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ విషయం అయితే వైరల్ గా మారుతున్నది. ఈ విషయం విన్న అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా రజనీకాంత్ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని గతంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా వార్తలు వినిపించాయి.


హీరో రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ఈ చిత్రం రూ .1000 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ ఏడాది ఏకంగా రెండు చిత్రాలతో అభిమానులను కనులవిందు చేయబోతున్నట్లు తెలుస్తోంది రజినీకాంత్. మరి సినిమాల రిటైర్మెంట్ పై రజినీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: