తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సాయి ధరమ్ తేజ్ తన కెరియర్లో చాలా విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. సాయి ధరమ్ తేజ్ కెరియర్లో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సినిమాలలో సుప్రీమ్ మూవీ ఒకటి. ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ 2016 వ సంవత్సరం మే 5 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు ఆ సమయంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 8.45 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.50 కోట్లు , ఉత్తరాంధ్రలో 2.98 కోట్లు , ఈస్ట్ లో 1.85 కోట్లు , వెస్ట్ లో 1.40 కోట్లు , గుంటూరు లో 1.97 కోట్లు , కృష్ణ లో 1.42 కోట్లు , నెల్లూరు లో 72 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 22.28 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.35 కోట్లు , ఓవర్సీస్ లో 75 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 25.35 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మొత్తంగా 25.38 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాకు 4.38 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sdt