నాచురల్ స్టార్ నాని కొంత కాలం క్రితం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాల కలెక్షన్ల విషయంలో అనేక కొత్త కొత్త రికార్డులను సృష్టించింది. నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా ... శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. 4 వ రోజు హిట్ ది థర్డ్ కేస్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. కానీ ఈ సినిమా నాలుగవ రోజు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న దసరా మూవీ ని మాత్రం క్రాస్ చేయలేక పోయింది. విడుదల అయిన నాలుగవ రోజు దసరా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.72 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మీడియం రేంజ్ హీరోలలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో దసరా మూవీ మొదటి స్థానంలో కొనసాగుతుంది.

ఇక తాజాగా నాని నటించిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ కి విడుదల ఆయన నాలుగవ రోజు 5.04 కోట్ల కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి. దానితో ఈ మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన మీడియం రేంజ్ మూవీలలో మూడవ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: