బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో అజయ్ దేవ్ గన్ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం రైడ్ అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ద్వారా అజయ్ దేవ్ గన్ కి సూపర్ సాలిడ్ విజయం మరియు మంచి గుర్తింపు కూడా లభించింది. ఇకపోతే తాజాగా రైడ్ మూవీ కి కొనసాగింపుగా రైడ్ 2 అనే సినిమాను రూపొందించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాలు నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. దానితో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు ప్రస్తుతం దక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్సాఫీస్ కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అనే విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రకారం ఈ మూవీ కి నాలుగు రోజుల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.

తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమాకు మొదటి రోజు 19.71 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 13.05 కోట్లు , మూడవ రోజు 18.55 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక నాలుగవ రోజు ఈ సినిమాకు 22.52 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 4 రోజుల్లో 73.83 కోట్ల కలెక్షన్లు దక్కినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad