ఒక్క అప్డేట్ కూడా లేకుండా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న సినిమా ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా ఎస్ ఎస్ ఎం బి 29 అనే చెప్పాలి.  టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంగా కమిట్ అయిన ప్రాజెక్ట్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా.  ఈ సినిమా కోసం కేవలం తెలుగు జనాలే కాదు  పాన్ ఇండియా రేంజ్ లో ఉండే జనాలు వెయిట్ చేస్తున్నారు . ఈ సినిమాతో మరొక ఆస్కార్ ని ఇండియాకి తీసుకొస్తాడు రాజమౌళి అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు .


కాగా రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది . రాజమౌళి పదే మహేష్ బాబును ఒక విషయం కారణంగా టార్చర్ చేస్తున్నారట . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి పని పిచ్చోడు.. అంతే కాదు ఏ విషయానైనా సరే క్లారిటీగా చేయాలి అనే టైప్ . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటునాటు పాటకి స్టెప్స్ కోసం ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో చరణ్ -తారక్ ని అని అందరికీ తెలిసిందే.  ఇప్పుడు రాజమౌళి - మహేష్ బాబుని లుక్స్ పరంగా ఇబ్బంది పెడుతున్నారట.



మహేష్ బాబు లుక్స్ రాజమౌళి అనుకున్నట్లు రావట్లేదు అని ..మహేష్ బాబు ఇంకా ఆ విషయంలో బాగా కసరతులు చేయాలి అని .. రకరకాల ఫొటోస్ చూపించి ఆ విధంగా కావాలి అంటూ రకరకాల డైట్ ఫాలో అవ్వమని సజెస్ట్ చేస్తున్నారట . మహేష్ బాబు ఆల్రెడీ అలాంటివి చేస్తున్నాడు కానీ రాజమౌళి అనుకున్న లుక్స్ రావడం లేదు.  మరి అలాంటి అప్పుడు రాజమౌళినే కాంప్రమైజ్ అవ్వాలి . కానీ రాజమౌళి ఆ టైప్ కాదు . అందుకే మహేష్ బాబుని విపరీతంగా టార్చర్ చేసేస్తున్నారట . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: