
మరాఠీ బ్యూటీ నే అయినా భాగ్యశ్రీ బోర్సేను తెలుగు జనాలు బాగా అభిమానించి ఆరాధించారు . సినిమా భారీ డిజాస్టర్ అయిన అమ్ముడు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అంతేకాదు ఒక్కసారిగా స్టార్ సినిమాలో అవకాశాలు అందుకునేలా తన అందాల పెర్ఫార్మన్స్ చూపించింది . ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా లో ఆమె హీరోయిన్గా నటిస్తుంది. అంతేకాదు దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో రూపొందుతున్న కాంత వంటి చిత్రంలో కూడా ఆమె హీరోయిన్గా నటిస్తుంది. దీంతో పాటు మరో రెండు బిగ్ ప్రాజెక్ట్ లను చేతిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది .
అయితే ఇప్పుడు రామ్ పోతినేనితో భాగ్యశ్రీ డేటింగ్ చేస్తుంది అన్న వార్త తెగ చక్కర్లు కొడుతుంది . దానికి కారణం రాపో 22 సినిమాలో వీళ్ళిద్దరి కాంబోనే . ఈ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అని ..అనేక ప్రచారాలు జరుగుతున్నాయి . దానికి తగ్గట్టే రామ్ పోతినేని హ్యాపీ బర్త్డ డే బీబీ అంటూ భాగ్యశ్రీ ఫోటోని షేర్ చేశారు . "ఈ ఏడాది నీకు ప్రేమ విజయాలు సంతోషం దక్కుతాయని ఆశిస్తున్నాను అందుకు నువ్వు అర్హురాలివి లవ్ అండ్ లక్ "అంటూ రాం పోస్ట్ చేశారు.
ఇప్పుడు రామ్ బిబి అని సంబోధించడం అందరికీ పెద్ద డౌట్లు క్రియేట్ చేస్తుంది . అంతేకాదు లవ్ అండ్ లక్ అనే పదాలు ఎందుకు యూస్ చేశాడు అని అనుమానాలు కూడా కలిగిస్తున్నాయి .వీరిద్దరి మధ్య సినిమాకి మించిన ఏదో రిలేషన్షిప్ ఉంది అని త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి వార్త వినినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు వీళ్లిద్దరి జోడి కూడా బాగుంది అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు జనాలు..!