దేశమంతా ఆపరేషన్ సింధూర్ గురించి ఇండియన్ ఆర్మీని కొనియాడుతూ ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక బాధ్యతగల పొజిషన్లో ఉన్న మంచు విష్ణు మాత్రం తన సోషల్ మీడియా ఖాతాలో షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఇక ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు నిన్ను రాళ్లతో కొట్టాలి అంటూ ఆయనపై నెట్టింట్లోనే దుమ్మెత్తి పోస్తున్నారు. మరి ఇంతకీ మంచూ విష్ణు చేసిన పోస్ట్ ఏంటి.. ఎందుకు నెటిజన్స్ ఆయనపై గుర్రుగా ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. మంచు విష్ణు హీరోగా.. మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు కన్నప్ప ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు జూన్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా తన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఎక్కడెక్కడికి వెళ్లబోతున్నారు ఏ ఏ దేశాల్లో తన సినిమాని ప్రమోట్ చేసుకోబోతున్నారు అనే విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 

కన్నప్ప మూవీ విడుదలకి ఇంకా నెలరోజుల సమయం ఉండగానే యూఎస్ లో ప్రమోషన్స్ మొదలెట్టబోతున్నారు మంచు విష్ణు. ఇందులో భాగంగా న్యూ జెర్సీలో మే 8న సాయంత్రం 7:30 కన్నప్ప మూవీ ఈవెంట్ ని భారీగా నిర్వహించబోతున్నారట. అలాగే మే 9, 10 తేదీలలో డల్లాస్, డే ఏరియాలో కన్నప్ప మూవీ ఈవెంట్ ఉండబోతున్నట్టు తన వీడియోలో పోస్ట్ చేశారు.అంతే కాకుండా నేను సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను అనే విషయం చాలామందికి తెలియదు.అలాగే LA లో స్టంట్ మ్యాన్ గా కూడా వర్క్ చేశాను.అలాగే నేను తెలుగు స్టంట్ యూనియర్ సభ్యుడుని అయినందుకు గర్వపడుతున్నాను. కన్నప్ప మూవీ లో షోరన్నర్ గా చాలా వరకు సన్నివేశాలను నేనే డిజైన్ చేసుకున్నాను.

ఇక యాక్షన్ సన్నివేశాలకు ప్రాణం పోసిన మాస్టర్ కెచాకు ధన్యవాదాలు అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం మంచు విష్ణు పెట్టిన పోస్ట్ చాలామంది నెటిజన్లకు నచ్చడం లేదు. అయితే సాధారణంగానే విష్ణు చేసే పోస్టులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఉంటుంది. ఇక పాకిస్తాన్ కి భారత్ కి యుద్ధం జరుగుతున్న వేళ మంచు విష్ణు ఆపరేషన్ సింధూర్ గురించి స్పందించకుండా తన సినిమాకి సంబంధించిన పోస్ట్ పెట్టడంతో చాలామంది నెటిజన్లు ఆయన పెట్టిన పోస్ట్ని విమర్శిస్తున్నారు. అంతేకాదు నీలాంటి వాళ్లను రాళ్లతో కొట్టాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నెటిజెన్స్ మంచు  విష్ణుని విమర్శిస్తూ పెట్టిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: