టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

సినిమా విడుదల అయిన కొంత కాలానికి దేవర పార్ట్ 2 మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది అని తారక్ అభిమానులు ఆశించారు. కానీ అలాంటి ప్రకటన ఏది రాలేదు. తారక్ "దేవర పార్ట్ 1" తర్వాత వార్ 2 సినిమా షూటింగ్లో బిజీ అయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ స్టార్ట్ చేశాడు. దీనితో దేవర పార్ట్ 2 మూవీ ఉంటుందా ..? లేదా అనే కన్ఫ్యూజన్లో తారక్ అభిమానులు పడిపోయారు. అలాంటి సమయం లోనే తారక్సినిమా ఈవెంట్లో భాగంగా దేవర పార్ట్ 2 మూవీ కచ్చితంగా ఉంటుంది.

మరికొన్ని రోజుల్లోనే ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతుంది అని చెప్పాడు. దానితో తారక్ ఫాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం కొరటాల శివ "దేవర పార్ట్ 2" కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్లు , మరో పన్నెండు , పదమూడు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: