కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకు సూర్య నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. అలా తెలుగులో డబ్ అయ్యి విడుదల అయిన సినిమాలలో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూర్య కు మంచి క్రేజ్ ఏర్పడింది. దానితో సూర్య నటించిన చాలు సినిమాలు తెలుగులో కూడా మంచి అంచనాల నడుమ విడుదల అవుతూ ఉంటాయి. తాజాగా సూర్య , కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రేట్రో అనే మూవీ లో హీరో గా నటించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి పూజ హెగ్డేమూవీ లో హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ మంచి అంచనాల నడుమ పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల అయింది. ఈ సినిమాను తెలుగులో కూడా రెట్రో అనే టైటిల్ తోనే విడుదల చేశారు. మరి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 6 రోజుల్లో నైజాం ఏరియాలో 1.31 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 43 లక్షలు , ఆంధ్ర లో 1.58 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 6 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.31 కోట్ల షేర్ ... 6.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ పై మొదటి నుండి తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.50 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 10.50 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 7.28 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: