తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో నాగ చైతన్య ఒకరు. నాగ చైతన్య హీరో గా రూపొందిన ఎన్నో సినిమాలకు మంచి కలెక్షన్లు వచ్చాయి. చైతూ హీరో గా రూపొందిన సినిమాలలో బ్లాక్ బాస్టర్ కలెక్షన్లను తెచ్చుకున్న సినిమాలలో 100% లవ్ మూవీ ఒకటి. ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ 2011 వ సంవత్సరం మే 6 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి తాజాగా 14 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 14 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ మూవీ కి వచ్చిన కలెక్షన్లు మరియు లాభాల వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 6.05 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.50 కోట్లు , ఉత్తరాంధ్ర లో 1.90 కోట్లు , ఈస్ట్ లో 1.42 కోట్లు , వేస్ట్ లో 1.28 కోట్లు , గుంటూరులో 1.22 కోట్లు , కృష్ణ లో 1.07 కోట్లు , నెల్లూరులో 68 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 16.12 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలుపుకొని 1.95 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 18.07 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా 10.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 18.07 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ 7.27 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: