సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో అత్యంత తక్కువ మంది కి మాత్రమే చాలా తక్కువ సమయంలో అద్భుతమైన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఇకపోతే చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో కయాదు లోహర్ ఒకరు. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం శ్రీ విష్ణు హీరో గా రూపొందిన అల్లూరి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్సా ఫీస్ ఫెయిల్యూర్ అయ్యింది.

దానితో ఈ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఆశ్విత్ మరిమత్తు దర్శకత్వంలో రూపొందిన డ్రాగన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఇక ఈ సినిమా తమిళ్ మరియు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈమెకు ఈ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కింది. ఇది ఇలా ఉంటే నాచురల్ స్టార్ నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని అనుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇక నాని తన తదుపరి మూవీ ని శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు ది ప్యారడైజ్ అనే టైటిల్ ని కూడా మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ లో కయాదు లోహర్ , నాని కి జోడిగా ఎంపిక అయినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: