కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి సూర్య కొంత కాలం క్రితం శివ దర్శకత్వంలో రూపొందిన కంగువా అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో దిషా పటాని హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ అనేక భాషలలో విడుదల అయిన ఈ సినిమా భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఇలా అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్లాప్ కావడంతో సూర్య అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇకపోతే సూర్య తాజాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రేట్రో అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు కూడా నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కూడా పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయలేకపోతోంది. దానితో సూర్య అభిమానులు పెద్ద ఎత్తున డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఏడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఏడు రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.

మూవీ కి 7 రోజుల్లో నైజాం ఏరియాలో 1.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 44 లక్షలు , ఆంధ్ర లో 1.64 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 7 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.43 కోట్ల షేర్ ... 7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.50 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 10.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 7.07 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: