రవితేజ హీరోగా నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. అలా రవితేజ హీరోగా రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న సినిమాలలో కిక్ మూవీ ఒకటి. ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా నటించగా ... సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2009 వ సంవత్సరం మే 8 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 16 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 16 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమాకు ఆ సమయంలో వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.

మూవీ కి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 7.53 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.72 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.2 కోట్లు , ఈస్ట్ లో 94 లక్షలు , వెస్ట్ లో 92 లక్షలు , గుంటూరులో 1.07 కోట్లు , కృష్ణ లో 1.03 కోట్లు , నెల్లూరులో 84 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 18.89 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలుపుకొని 3.86 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 22.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 13.77 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 22.75 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ కి 8.95 కోట్ల లాభాలు వచ్చాయి దానితో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt