సాధారణంగా ఏదైనా విపత్తులు జరిగిన, మరి ఏదైనా అభిమానులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన కూడా సహాయం చేయడానికి సినీ పరిశ్రమతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు. ఇలా గతంలో కూడా ఎన్నోసార్లు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి నటీనటులే కాకుండా దర్శక నిర్మాతలు కూడా అటు రాష్ట్రాలకు దేశానికి కూడా తమ వంతు ఆర్థిక సహాయంగా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా పేరుపొందిన అల్లు అరవింద్ ఒక విషయాన్ని ప్రకటించడం జరిగింది.


భారత్ ,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో యుద్ధ వాతావరణం కూడా కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందని ఆందోళన అటు ప్రజలలో కనిపిస్తోంది. అయితే ఈ రోజున శ్రీ విష్ణు సింగిల్ సినిమా రిలీజ్ సందర్భంగా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో సింగిల్ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు చిత్ర బృందం. ఈ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ తమ ఒక సపోర్టు ఎప్పుడూ కూడా సైనికులకు ఉంటుందంటూ తెలియజేశారు.



సింగిల్ సినిమా  వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని మన ఇండియన్ ఆర్మీ సైనికులకు అందజేస్తున్నాను అంటూ అల్లు అరవింద్ తెలియజేశారు. భారత్ మాతాకీ జై అని ప్రకటించడం జరిగింది అల్లు అరవింద్. ఈ విషయం విన్న సింగిల్ సినిమా టీమ్ బృందంతో పాటు పలువురు అభిమానులు కూడా అల్లు అర్జున్ ని పొగిడేస్తూ ఉన్నారు. సినీ ఇండస్ట్రీ అంటే కేవలం లాభాల కోసమే కాదు ఎన్నో కార్యక్రమాల కోసం ఉపయోగపడుతోందంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అల్లు అరవింద్ తీసుకున్న ఈ నిర్ణయంతో సినీ ఇండస్ట్రీలో వారు ముందుకు వస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: