ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమ లోకి అనేక మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మందికి మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయం , మంచి గుర్తింపు వస్తున్నాయి. ఇక మరి కొంత మంది కి మాత్రం నటించిన మొదటి సినిమాతో మంచి విజయం దక్కకపోయినా మంచి గుర్తింపును దక్కించుకొని వరుస అవకాశాలను దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. ఇక నటించిన మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకోకపోయినా సూపర్ సాలిడ్ గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మలలో కేతికా శర్మ ఒకరు.

ఈ నటి ఆకాష్ పోరి హీరో గా రూపొందిన రొమాంటిక్ అనే సినిమా ద్వారా తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించకపోయినా ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. తర్వాత ఈమెకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు కూడా దక్కాయి. కానీ ఈమెకు నటించిన అనేక సినిమాల ద్వారా అపజయాలే దక్కాయి. కొంత కాలం క్రితం ఈమె నితిన్ హీరో గా రూపొందిన రాబిన్ హుడ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే తాజాగా ఈమె శ్రీ విష్ణు హీరోగా రూపొందిన సింగిల్ మూవీ లో హీరోయిన్గా నటించింది. నిన్న అనగా మే 1 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం కాయంగా కనబడుతుంది. దానితో కేతిక శర్మ కెరీర్ను మొదలు పెట్టిన చాలా సంవత్సరాల తర్వాత మొదటి విజయాన్ని అందుకుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks