కొన్ని సంవత్సరాల క్రితం హిందీ లో దోస్తానా అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ వచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ మూవీ వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీ కి కొనసాగింపుగా దోస్తానా 2 అనే మూవీ ని రూపొందించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం దోస్తానా 2 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా దోస్తానా 2 మూవీ లో ఇద్దరు హీరోయిన్లను ఇప్పటికే మేకర్స్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఆ ఇద్దరు హీరోయిన్లలో ఓ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక మరో బ్యూటీ తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇంతకు ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరు అనుకుంటున్నారా ..? వారు ఎవరో కాదు జాన్వి కపూర్ , శ్రీలీల. దోస్తానా 2 మూవీ లో జాన్వీ కపూర్ , శ్రీ లీల లను హీరోయిన్లుగా అనుకుంటున్నట్లు , అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు , వీరు కూడా ఈ సినిమాలో నటించడానికి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అన్ని ఓకే అయితే దోస్తానా 2 మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులు అయినటువంటి జాన్వి కపూర్ , శ్రీ లీల హీరోయిన్లుగా కనిపించే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: