టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అయ్యింది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ల వద్ద అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. పవన్ నటించిన సినిమాలకు హిట్ .. ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అదే పవన్ నటించిన సినిమాకు హిట్ టాక్ గనుక వచ్చినట్లయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది. అంతటి క్రేజ్ ఉన్న హీరో కావడంతో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదల అవుతుంది అంటే వేరే హీరో సినిమా విడుదలకి కనీసం వారం గ్యాప్ ఉండేలా మేకర్స్ చూసుకుంటూ ఉంటారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 30 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మే 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ , నారా రోహిత్ కలిసి భైరవం అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ ని కూడా మే 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. హరిహార వీరమల్లు సినిమా విడుదల తేదీనే కింగ్డమ్ , భైరవం సినిమా విడుదల తేదీలు కూడా ఉన్నాయి. ఒక వేళ హరిహర వీరమల్లు సినిమా చెప్పిన విధంగానే మే 30 వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు ఉంటే కింగ్డమ్ , భైరవం సినిమాల విడుదల తేదీలను మారుస్తారా ..? లేక మే 30 వ తేదీన ఈ రెండు సినిమాలను కూడా విడుదల చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: