తమిళంలో మొదట కమెడియన్ గా పలు చిత్రాలలో నటించి భారీ క్రేజ్ సంపాదించుకున్న సంతానం ఆ తర్వాత హీరోగా కూడా గత ఏడాది DD భూతాల బంగ్లా అంటూ ప్రేక్షకులను అలరించారు. అయితే ఈసారి కూడా మళ్లీ అదే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు సంతానం. డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ అంటూ తెరకేక్కిస్తున్న ఈ చిత్రం మే 16వ తేదీన తెలుగు ,తమిళ భాషలలో రిలీజ్ కాబోతున్నది. ఈ మేరకు తాజాగా చిత్ర బృందం తెలుగు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఆదరణ పొందుతున్నట్లు కనిపిస్తోంది


ఈసారి సంతానం తాను నటించిన గత రెండు చిత్రాలకు మించి మరి ఫన్, హారర్ సీన్స్ ఉండబోతున్నట్లు తాజాగా ట్రైలర్ చూస్తేనే కనిపిస్తోంది. గీతిక హీరోయిన్గా నటించగ గౌతమ్ వాసుదేవుని ఇందులో కీలకమైన పాత్రలో నటించగా సెల్వరాఘవన్, రెడ్ కింగ్స్ లే తదితర నటీనటులు నటించారు. డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వం వహించగా నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.


సినిమా ట్రైలర్ విషయానికి వస్తే సినిమాలకు రివ్యూలు ఇచ్చే ఒక క్యారెక్టర్ లో సంతానం నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇతని మీద ఒక దయ్యం పగబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి ప్రవేశపెట్టి రివ్యూ ఇవ్వాలంటే ఆదేశిస్తారు.. అలా ఐలాండ్ లో హీరో పడేటువంటి ఇబ్బందులను చాలా ఫన్నీగా చూపించారు డైరెక్టర్ ఆనంద్. కింగ్స్ లీ,సంతానం మధ్య వచ్చే కామెడీస్ అన్ని వేషాలు హైలైట్ గా కనిపిస్తున్నాయి. అయితే చివరికి డైరెక్టర్ నెల్సన్ ఎవరు కూడా తెలియదని చెప్పారు. మరొక కమెడియన్ రాజేంద్రన్ జైలర్ 2 కట్ట అంటూ చెబుతారు. ఇక తర్వాత జరిగేటువంటి కామెడీ సన్నివేశాలు కూడా బాగానే ఆకట్టుకున్నట్టు కనిపిస్తున్న మరికొంతమందిని ట్రైలర్ కన్ఫ్యూజన్లో పడేసేలా కనిపిస్తోంది. మరి సినిమా థియేటర్లో ఏ విధంగా సంతానం ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: