అక్కినేని నాగేశ్వరరావు మనవడు అక్కినేని సుమంత్ ప్రస్తుతం అనగనగా అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఇందులో భాగంగా అక్కినేని ఫ్యామిలీ పై సుమంత్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.మరి ఇంతకీ అక్కినేని ఫ్యామిలీ పై సుమంత్ ఏమని మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు మనవడు కావడంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే భారీ ఎత్తున సుమంత్ ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు అక్కినేని ఫ్యామిలీ. అలా ఎన్నో హిట్ సినిమాలు చేసిన అక్కినేని సుమంత్ తన స్టార్డం ని కాపాడుకోలేక పోయారు. ముఖ్యంగా పెళ్లి అయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకోవడంతో పర్సనల్ కెరియర్ కాస్త చిక్కుల్లో పడింది. 

అంతేకాకుండా సినిమాలు కూడా రాకపోవడం అలాగే చేసిన సినిమాలు కూడా ప్లాప్ అవ్వడంతో ఈయన కెరియర్ ఆగమ్యగోచరంగా మారింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కీరోల్స్ చేసినప్పటికీ అంతగా గుర్తింపు రావడం లేదు. అయితే అలాంటి సుమంత్ ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగేశ్వరరావు గురించి చెప్పమనగా.. అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు తండ్రి లాంటి అనుబంధం ఉంది.నన్ను ఆయన దత్తత తీసుకున్నాక నన్ను కొడుకులాగే చూసుకున్నారు.

ఆయనలో ఎన్నో బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎంత పెద్ద హీరో అయినా సరే సింపుల్ గా ఉంటారు. ఆయన నుండి ఈ క్వాలిటీని నేర్చుకోవచ్చు. అలాగే నాగార్జున గురించి ప్రశ్న ఎదురవగా..నాగార్జున గారు ఆయన తరం హీరోలైన వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున  లలో ఒక స్పెషల్ పాత్రలు ఎంచుకొని చేసిన హీరో. వెరైటీ పాత్రలు ఎంచుకోవడంలో ఆయన బెస్ట్ అంటూ సుమంత్ చెప్పుకొచ్చారు. ఇక సుమంత్ నటించిన అనగనగా మూవీ ఈటీవీ విన్ ఓటీటి లో మే 15 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: