సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత స్టార్స్ లైఫ్ ఎంత దారుణంగా మారిపోయింది అనేది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు.  స్టార్ సెలబ్రిటీస్ ఏది చేసిన తప్పు పడుతున్నారు. ఏ విషయం పై  స్పందించకపోయిన తప్పు పడతారు . స్పందించిన తప్పు పడతారు. ఈ మధ్యకాలంలో ఇండియా - పాకిస్తాన్ వార్ పై ప్రభాస్ స్పందించట్లేదు అంటూ దారుణాతి దారుణంగా ఆయన పేరు పై ట్రోల్లింగ్ చేశారు జనాలు . ఫైనల్లీ ప్రభాస్ స్పందించినా కూడా ఇంత సింపుల్గా కొట్టి పడేసాడు ఏంటి..? వేరే సినిమాల హీరోల గురించి అయితే ఓ రేంజ్ లో పోస్ట్లు చేస్తారు.. ప్రభాస్ కి ఇండియా ఆర్మీ ని పొగిడేందుకు తీరిక లేదా..? టైం లేదా..? అంటూ ఘాటుఘాటు పదాజాలంతో ట్రోల్ చేశారు .


అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ పేర్లు  వైరల్ అవుతున్నాయి . దానికి కారణం వాళ్ళు నందమూరి ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసిన తారక రామారావుకి విష్ చేయకపోవడమే . మనకు తెలిసిందే వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో  దివంగత జానకిరామ్ తనయుడు తారకరామారావు హీరో గా తెరంగెట్రం చేస్తున్నాడు . ఈ కొత్త సినిమా రీసెంట్ గానే ప్రారంభమైంది . హరికృష్ణ మనవడి సినిమా ప్రారంభోత్సవం జరిగితే హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్ - కళ్యాణ్రామ్ ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది .



ఇప్పుడు వాళ్ళిద్దరికీ నందమూరి ఫ్యామిలీతో అసలు సంబంధం లేదా..? అనే విధంగా కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇక్కడ గ్రాండ్గా పూజ కార్యక్రమాలు జరుగుతుంటే ఎన్టీఆర్ లండన్ లో ఉన్నాడు ఏంటి..? అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు.  సరే లండన్ కి పోతే ఏం సోషల్ మీడియా వేదికగా ఆల్ ద బెస్ట్ అంటీ ట్వీట్ చేస్తే ఏమైపోతుంది..? అతగాడు హీరోగా రావడం జూనియర్ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ కి ఇష్టం లేదా..? అంటూ దారుణంగా  మాట్లాడుతున్నారు . హరికృష్ణ మనవడి సినిమా ప్రారంభోత్సవం రోజున ఎన్టీఆర్ కుమార్తెలు అటెండ్ అయ్యారు.  నారా చంద్రబాబు నాయుడు - లోకేష్ ట్వీట్స్ చేశారు . హరన్న మనవడి పక్కన హరికృష్ణ కుమారులు కనిపించలేదు . గతంలో జానకిరామ్ కుమారుడు ఎన్టీఆర్ ని గ్రాండ్ గా వెల్కమ్ చేస్తూ తారక్ ట్వీట్ చేశాడు. మరి ఎందుకు ఇప్పుడు పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఏ విషయంపై ట్విట్ చేయలేదు..? అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!



మరింత సమాచారం తెలుసుకోండి: