- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకు గతవారం విడుదలైన సింగిల్ మూవీ మంచి విజయం సాధించింది .  కమర్షియల్ గా నిర్మాణ సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది .. ఇక ఈ సినిమా ను తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మించింది .. అయితే ఇప్పుడు మళ్లీ హీరో శ్రీ విష్ణు తో గీతా ఆర్ట్స్ మరో సినిమా ను తెరకెక్కించే పనిలో పడింది .. ఆయ్‌’తో ఆకట్టుకున్న దర్శకుడు అంజి .  జిఏ 2 లో రూపొందించిన సినిమా బాగానే మెప్పించింది .. అయితే ఆ తర్వాత అంజి సినిమా ఏమిటన్న విషయంలో క్లారిటీ రాలేదు .  ఇక ఇప్పుడు శ్రీ విష్ణు , అంజి కాంబోలో ఓ సినిమా ను రూపొందించడానికి ప్లాన్  చేస్తుందనేది ఇన్సైడ్ వర్గాల టాక్ ..


సింగిల్ మూవీ విజయం తో శ్రీ విష్ణు మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు .  సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌తర్వాత తనకు ద‌క్కిన  మరో హిట్ కూడా ఇదే .. ఎంటర్టైన్మెంట్ సినిమాలు శ్రీ విష్ణు కి బాగా కలిసి వస్తున్నాయని సింగిల్ మరోసారి నిరూపించింది .  ఇక అందుకే తన దగ్గరకు అలాంటి కథ‌లే వస్తున్నాయి ఆయ్ ల్లో   మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది .. అంజి కామెడీ కథలు సన్నివేశాలు బాగా రాస్తారు .. అలాంటి కథతోనే శ్రీవిష్ణువుని కలిసినట్టు తెలుస్తుంది .. గీత ఆర్ట్స్ కాబట్టి బడ్జెట్ విషయం లో కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండవు .. కాకపోతే శ్రీ విష్ణు లైన్ అప్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంది .. తను ఇది వరకే ఒప్పుకున్న కథలు కొన్ని ఉన్నాయి .. వాటి మధ్య ‘ఆయ్‌ దర్శకుడు తో సినిమా ఎప్పుడుంటుంది ? అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: