
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా లలో దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఓజీ సినిమా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ను చాలా వరకు మేకర్స్ కంప్లీట్ చేసేసి త్వరలోనే రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నారు. పవన్ కూడా తిరిగి కాల్షీ ట్లు ఇవ్వడంతో ప్యాచ్ వర్క్ తో పాటు ఇతర పనులు సమాంతరంగా కంటిన్యూ చేస్తున్నారు.
సాహో తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ స్టైలీష్ గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం పవన్ అభిమానులు మాత్రమే కాదు... తెలుగు సినీ అభిమానులు ప్రతి ఒక్కరు చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ లో నటి శ్రియా రెడ్డి కూడా జాయిన్ అయ్యింది. ఆమె తన పాత్ర .. తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటుందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమెది పవర్ఫుల్ పాత్ర అని సమాచారం. పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా చేస్తున్నాడు. ఓజీ సినిమాకు ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్ము లేపుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు