మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని అశ్వినీ దత్ నిర్మించగా ... ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ 1990 వ సంవత్సరం మే 9 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదల అయ్యి 35 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను మే 9 వ తేదీన పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఐదు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి ..? మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

రీ రిలీజ్ లో భాగంగా ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 96 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 30 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 1.04 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఐదు రోజుల్లో 2.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ఐదు రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకుని 54 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకి రీ రిలీజ్ లో భాగంగా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.84 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: