టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శక త్వం వహించి అందులో చాలా మూవీలతో విజయా ల ను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆఖరుగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ మరియు డబల్ ఈస్మార్ట్ మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాలను ఎదుర్కున్నాయి. ఇకపోతే పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ ని తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతితో చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి బెగ్గర్ అనే టైటిల్ ను మేకర్స్ అనుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో టబు , నివేత థామస్ ముఖ్య పాత్రలలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు , ఈమె పాత్ర నిడివి ఈ సినిమాలో చాలా తక్కువే గానే ఉండనున్నట్లు కానీ ఈ పాత్ర ఈ సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పే విధంగా ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. దానితో ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ఈ సినిమాలో నటించడం లేదు అని , ఈ మూవీ లో విద్యా బాలన్ నటించనుంది అని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో పూరి జగన్నాథ్ తనయుడు అయినటువంటి ఆకాష్ పూరి కూడా నటించబోతున్నాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: