టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం వరుస పెట్టి అద్భుతమైన విజయాలను అందుకుంటున్న నటులలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన కొంత కాలం క్రితం దసరా మూవీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీ తో మరో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత సరిపోదా శనివారం మూవీ తో కూడా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా నాని "హిట్ ది థర్డ్ కేస్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఎన్ని లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

13 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 17.68 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 4.92 కోట్లు , ఉత్తరాంధ్రలో 4.98 కోట్లు , ఈస్ట్ లో 2.74 కోట్లు , వెస్ట్ లో 2.17 కోట్లు , గుంటూరులో 2.75 కోట్లు , కృష్ణలో 2.47 కోట్లు , నెల్లూరులో 1.29 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 13 రోజుల్లో 39 కోట్ల షేర్ ... 68.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకుని ఈ మూవీ కి 6.80 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఇతర భాషలలో 1.95 కోట్లు , ఓవర్సీస్ లో 12.38 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 60.13 కోట్ల షేర్... 114 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 48.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 50 కోట్ల భారీ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటికే 10.13 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: