టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి పరిచయం అనవసరం. అయితే కొంతకాలంగా నటి సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు ఇప్పటికే ఐదుసార్లు హింట్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది.  అయితే తాజాగా ఈ రూమర్స్ పై నటి సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని ఆయన సోషల్ మీడియా వేదికగా ఖండించారు.

ఇకపోతే ఇటీవల శుభం సినిమా టీమ్ తో పాటుగా దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా ఆమె పోస్టులో కనిపించారు. సమంత పోస్టులో ఆయన కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. పికిల్ బాల్ ఈవెంట్ లో సమంత రూత్ ప్రభుతో, రాజ్ నిడిమోరు కనిపించారు. ఆ తర్వాత రాజ్ నిడిమోరు స్నేహితుడు నిర్వహించిన సమావేశంలో రాజ్ తో సమంత కనిపించింది. అలాగే రాజ్ తో కలిసి సమంత తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంది. శుభం ప్రమోషన్స్ లో కూడా రాజ్ నిడిమోరు పాల్గొన్నారు. శుభం సినిమా సక్సెస్ ని ప్రస్తుతం రాజ్ నిడిమోరుతో సమంత జరుపుకుంటుంది. దీంతో సమంత, రాజ్ తో డేటింగ్ లో ఉందని తెలియజేయడానికి ఇలా వరుసగా హింట్స్ ఇస్తుందని.. వారిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే సమంత తెలుగుతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాల్లో నటించింది. సమంత హిందీ, మలయాళం భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ ల లిస్టులో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. అయితే ఈ అందాల భామ ఇప్పటికే నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు , రెండు నంది అవార్డులు సహా అనేక అవార్డులు సొంతం చేసుకుంది.బ్యూటీ అత్తరింటికి దారేది, ఏం మాయ చేసావె, ఓ బేబీ, యశోద, రామయ్య వస్తావయ్యా, అఆ లాంటి మంచి మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సామ్ తన అందం, అభినేయంతో ఎంతమంది ప్రేక్షకుల మనసును దోచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: