తమిళ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో హీరో గా నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకం టూ ఒక ప్రత్యేక ఈ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈయన నటించిన ఎన్నో సి నిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందు లో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్ర మలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఆ అజిత్ కుమార్ తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ కి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. తాజాగా అజిత్ కుమార్ ఒక పని కోసం ఏకంగా 42 కిలోల బరువు తగ్గినట్టు పేర్కొన్నారు.

అసలు విషయం లోకి వెళ్తే ... తాజాగా అజిత్ కుమార్ మాట్లాడుతూ ... సినిమా మరియు రేసింగ్ లకు సరైన న్యాయం చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. అందుకే రేసింగ్ సీజన్లో మూవీలకు దూరంగా ఉండబోతున్నట్లు ఆయన తాజాగా తెలిపారు. కార్ల రేసింగ్ పై దృష్టి పెట్టినప్పుడు శారీరకంగా రెడీ అవ్వాలి అని అర్థమైనట్లు అయినా చెప్పాడు. అందుకే వర్కౌట్ చేసి 8 నెలల్లో దాదాపు 42 కిలాల బరువు తగ్గాను అని ఆయన తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. అలాగే తన తదుపరి సినిమా నవంబర్ నెలలో మొదలు కానున్నట్లు , వచ్చే ఏడాది వేసవి లో ఆ సినిమాను విడుదల చేయనున్నట్లు అజిత్ కుమార్ తాజాగా పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak