టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో సమంత ఒకరు. నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సమంత తాజాగా శుభం అనే సినిమాను నిర్మించింది. సమంత నిర్మించిన సినిమా కావడంతో మొదటి నుండి కూడా ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్లను కూడా సమంత దగ్గరుండి నిర్వహించింది. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేసి హిట్ స్టేటస్ను అందుకోవడం కష్టం అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా మంచి కలక్షన్లను రాబట్టి ఇప్పటికే హిట్ స్టేటస్ ను అందుకొని మంచి లాభాలను కూడా అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన తొమ్మిది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ఇప్పటివరకు ఎన్ని లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 88 లక్షల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్లో 1.08 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9 రోజుల్లో 1.96 కోట్ల షేర్ ... 4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక తొమ్మిది రోజులు ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 1.10 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా తొమ్మిది రోజులు ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 3.06 కోట్ల షేర్ ... 6.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 2.8 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 26 లక్షల లాభాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: