టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో విక్టరీ వెంకటేష్ , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉంటారు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు. చాలా సంవత్సరాల క్రితం రామ్ చరణ్ , కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన గోవిందుడు అందరివాడేలే అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు.

మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సమయం లో ఈ సినిమాలో ఓ.కీలకమైన పాత్రలో వెంకటేష్ ను తీసుకోవాలి అనే ఆలోచనలో కృష్ణవంశీ ఉన్నట్లు , అలాగే కృష్ణ వంశీ ... రామ్ చరణ్ , వెంకటేష్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీని రూపొందించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమాలో వెంకటేష్ ను కాకుండా శ్రీకాంత్ ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ... వెంకటేష్ , రామ్ చరణ్ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు , ఈ మూవీ షూటింగ్ను మరికొన్ని రోజుల్లోనే మొదలు పెట్టనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఒక వేళ నిజం గానే వెంకటేష్ , రామ్ చరణ్ హీరోలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ ని కనుక రూపొందించినట్లయితే దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి గోవిందుడు అందరివాడే సమయంలో మిస్ అయిన వెంకటేష్ , రామ్ చరణ్ కాంబో మూవీ నిజం గానే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: