బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటులలో హృతిక్ రోషన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ నటుడిగా ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. హృతిక్ రోషన్ నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో హృతిక్ రోషన్ కి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కలిసి వార్ 2 అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే వార్ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో వార్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వారు 2 మూవీ కి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ కు తెలుగు ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభించగా , హిందీ ప్రేక్షకుల నుండి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా హృతిక్ రోషన్ "వార్ 2" సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ ... వార్ 2 లాంటి భారీ స్థాయి సినిమాలను తెరకెక్కించడం అంత సులభమైన విషయం కాదు. ఈ సినిమా అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు కలిగిస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి అని హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: