
తాజాగా కేతిక శర్మకు మళ్లీ సినిమా అవకాశాలు పెరిగేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల డైరెక్షన్లో రాబోతున్న ఒక సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి ఈ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. అలాగే మరొక హీరో సాయి ధరం తేజ్ నటించబోయే ఒక సినిమా కోసం కూడా ఈ ముద్దుగుమ్మనే ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇలా కేవలం ఒక్క స్పెషల్ సాంగ్ తోనే పాపులారిటీ సంపాదించుకొని మళ్ళీ అవకాశాలు సంపాదించుకుంటున్నది కేతిక.
కేతిక శర్మ అందం, అభినయం ఉన్నప్పటికీ ఎందుకో లక్ కలిసి రావడానికి ఇన్నేళ్లు పట్టింది. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రంలో నటించిన కూడా ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్గా అయితే అవకాశాలు రాలేదు. అయితే పలు చిత్రాలను స్పెషల్ సాంగ్ లో ఆఫర్లు రావడంతో చేసినప్పటికీ ఇప్పుడు తాజాగా అదే సాంగ్ తో వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నది. వీటికి తోడు కుర్ర హీరోయిన్స్ సైతం మలయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగులో పాగా వేస్తూ ఉన్నారు. అలా ఇతర హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా మలయాళ ముద్దుగుమ్మలే అవకాశాలను అందుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా కేతిక శర్మకు స్టార్ స్టేటస్ అందుకుంటుందేమో చూడాలి.