- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ .. సౌత్ మక్క‌ల్ సెల్వ‌న్ విజయ్ సెతుపతి కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే .. పాన్ ఇండియా లెవెల్ లో మల్టిపుల్ లాంగ్వేజ్ లో రాబోతున్న ఈ సినిమాను పూరి కనెక్ట్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ , చార్మి కలిసి నిర్మిస్తున్నారు .. ఇక ఈ సినిమాను తెలుగు , తమిళం , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో తీసుకురాబోతున్నారు . అయితే తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే జూన్ నుంచి మొదలు కాబోతోంది .. ఈ సినిమాలో నటించే ప్రధాన నటీనటుల వివరాలు కూడా ప్రకటిస్తూ వస్తున్నాడు పూరీ జగన్నాథ్‌ .. ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ఒ కీలక పాత్రలో నటిస్తుండగా .. ఇక ఇప్పుడు విజయ్ కుమార్ కూడా నటిస్తున్నాడు అయితే ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే ..


అయితే ఇప్పుడు తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్లో పాల్గొన్న విజయ్ సేతుప‌తి టైటిల్  పై ఊహించని క్లారిటీ ఇచ్చారు .. పూరి జగన్నాథ్ పనిని నేను గౌరవిస్తాను ఆయన తెరకెక్కించిన‌ ప్రతి ఒక్క సినిమా చూశా.. స్క్రిప్ట్ వినడానికి రెండు మూడు రోజులు పడుతుంది ఏమో అనుకున్న గంటల వ్యవధిలోని పూరీ కంప్లీట్ చేశారు .. వచ్చి జూన్‌లో షూటింగ్ మొదలవుతుంది ఆడియిన్స్‌ కంటే నేనే ఎక్కువగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇక టైటిల్ అంటారా ఇంకా సినిమాకి టైటిల్ ఏది అనుకోలేదు .. బెగ్గర్ అనే టైటిల్ మీరే కన్ఫర్మ్ చేశారా ? అంటూ ఆయన నవ్వుతూ ఆ  ఈవెంట్లో తన ఆన్సర్ ఇచ్చేశాడు .. ఇక మరి విజయ్ సేతుపతి సినిమా తో అయినా పూరీ జగన్నాథ్ సరైన హిట్ అందుకుని కంబాక్ ఇస్తాడో లేదో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: