గ‌త కొన్ని సంవత్సరాలుగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో గట్టిగా రీ రిలీజ్ ట్రెండ్  నడుస్తుంది .. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం కొత్తే మీ కాకపోయినా .. గత మూడు ఏళ్లలో మాత్రం ఊహించిన ట్రెండ్‌కు చేరుకుంది . కొత్త సినిమాల స్థాయిలో భారీగా థియేటర్లు షోలు కేటాయించడం .. బెనిఫిట్ షోలు వేయటం అభిమానుల సంబరాలు భారీ స్థాయికి చేరడం .. వీటి ద్వారా కూడా భారీ ఓపెనింగ్స్ కలెక్షన్లు రికార్డుల గురించి చర్చించడం ఇలా చాలానే జరుగుతూ వచ్చాయి .. అలాగే ఎన్నోసార్లు చూసిన సినిమాను మళ్ళీ ఇలా థియేటర్లలో చూసి సెలబ్రేట్ చేయటం తెలుగు ప్రేక్షకులకే చెలుతూ వస్తుంది .. ఇతర భాషల వాళ్ళు సైతం తెలుగు ప్రేక్షకులను కొని ఆడుతూ వస్తారు.
 

దీని మీద కొంత విమర్శలు కూడా వస్తున్నాయి .. అయితే ఇప్పటి వరకు ఆయా హీరోల సినిమాలకు భారీ అభిమానులు పట్టం కట్టడం బాగానే ఉంది కానీ .. ఇక ఇప్పుడు ఈ తేడాలు పక్కన పెట్టి అందరూ కలిసి సెలబ్రేట్ చేయాల్సిన రీ రిలీజ్  ఒకటి రెడీ అయింది .. అదే మాయాబజార్ ..ఎన్ని సంవత్సరాలు గడిచిన .. తరాలు మారిన .. ఇది మన సినిమా తెలుగు వారు గర్వంగా చెప్పుకునే సినిమాల్లో మాయాబజార్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది .. రైటింగ్ టేకింగ్  యాటింగ్ ఇలా ఎన్నో విషయాల్లో ఎప్పటికీ ఈ సినిమా నుంచి నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు ఉన్నాయి .. దాదాపు ఏడు దశాబ్దాల కిందట వచ్చిన సినిమా అయినా ఇప్పుడు చూసిన ఎంతో కొత్తగా ఎంతో ఆసక్తికరంగా అనిపించే గొప్ప సినిమా ఇది ..

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ 102వ జయంతిని పుష్కరించుకొని ఈనెల చివరి వారంలో మాయాబజార్ ను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు .. గత కొన్నేళ్ల కిందట ఈ సినిమాని ఎంతో శ్రమించి మొత్తం కలర్ లోకి మార్చారు .. రీ రిలీజ్ ట్రెండ్ ఏమీ లేని టైంలో ఈ సినిమాను పరిమిత స్క్రీన్ లో రిలీజ్ చేస్తే భారీ స్పందన వచ్చింది .. ఇప్పుడు కొంచెం పెద్ద స్థాయిలో రీ రిలీజ్ చేయాలనుకుంటున్నారు .. అలాగే దీని గురించి కొందరు ప్రముఖులు కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టారు .. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకు పట్టం కట్టి మన సినిమా వైభవాన్ని కొత్త తరానికి తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: