మలయాళ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటివరకు ఎన్నో మలయాళ సినిమాలలో నటించి ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకొని ఇప్పటికి కూడా మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు . కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ లాల్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత , నిత్యా మీనన్ హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించడం  , ఇందులో మోహన్ లాల్ పాత్రకు అద్భుతమైన ప్రాధాన్యత ఉండడంతో ఈ మూవీ ద్వారా మోహన్ లాల్ కి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే కొంత కాలం క్రితం L2 ఎంపురన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న మోహన్ లాల్ తాజాగా తుడరుమ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మరో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇకపోతే తాజాగా మోహన్ లాల్ గొప్ప మనసును చాటుకున్నాడు. మోహన్ లాల్ తాజాగా చిన్న పిల్లల ఆరోగ్యం కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.

కేరళలో కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అండగా ఉంటాను అని ఆయన అన్నారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేస్తాను అని మోహన్ లాల్ తాజాగా వెల్లడించారు. అలాగే "Be A Hero" పేరిట డ్రగ్స్ మీద వ్యతిరేకంగా ప్రచారాలు కూడా చేపడతానని ఆయన తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం మోహన్ లాల్ , మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న కన్నప్ప సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: