టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి నటుడిగా , నిర్మాతగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకొని నటుడిగా ఏ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడో అలాగే ఎన్నో మూవీలను నిర్మించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని నిర్మాతగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇకపోతే తాజాగా కళ్యాణ్ రామ్ "అర్జున్ సన్నాఫ్ వైజయంతి" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా ... అలనాటి స్టార్ హీరోయిన్ విజయశాంతి ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు క్లైమాక్స్ ఒకటి అద్భుతంగా ఉన్న మిగతా సినిమా అంతా చాలా రొటీన్ గా ముందుకు సాగింది అని , క్లైమాక్స్ రేంజ్ లో కనుక సినిమా మొత్తం ఉండి ఉంటే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించేది అని అనేక మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ మూవీ కి క్లైమాక్స్ ను మినహాయిస్తే మిగతా మూవీ అంత రొటీన్ అనే సాగింది అని టాక్ రావడంతో ఈ మూవీ పెద్ద స్థాయి కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టడంలో విఫలం అయింది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో మాత్రం అద్భుతమైన రేంజ్ లో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపకపోయినా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నందుకు నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr