తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన తాజాగా సింగిల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో కేతీక శర్మ , ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఇప్పటికే ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి భారీ లాభాలను అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 12 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. అలాగే ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అని వివరాలను తెలుసుకుందాం.

సింగిల్ మూవీ కి 12 రోజుల్లో నైజాం ఏరియాలో 5 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 1.33 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఆంధ్రలో 5.27 కోట్ల కలెక్షన్లు దక్కాయి మొత్తంగా ఈ మూవీ కి 12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11.59 కోట్ల షేర్ ... 21.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 12 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలుపుకొని 3.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లో 15.09 కోట్ల షేర్ ... 28.68 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 6.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 7 కోట్ల టార్గెట్తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. 7 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15.09 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది. దానితో ఈ మూవీ కి 12 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 8.09 కోట్ల లాభాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv