తెలుగు సినిమా ఇండస్ట్రీలో రమ్యకృష్ణ ఎలాంటి పొజిషన్ లో ఉందో మనందరికీ తెలుసు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సౌందర్య, రోజా, మీనా, వంటి హీరోయిన్స్ ఉన్న సమయంలో రమ్యకృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చింది. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినటువంటి ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. అలాంటి రమ్యకృష్ణ ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉందని చెప్పవచ్చు. అలాంటి ఈమె తాజాగా  ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో తాను ఎదుర్కొన్న కొన్ని  అవమానకరమైన ఇబ్బందుల గురించి తెలియజేసింది. రమ్యకృష్ణ కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడిందట. ఈ విషయాన్ని ఆమె ఇంటర్వ్యూలో బయటపెట్టింది. మరి ఆమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎవరు ఏమన్నారు ఆ వివరాలు చూద్దాం..

 రమ్యకృష్ణ కొన్ని సంవత్సరాల పాటు హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో కొనసాగింది. ఆ తర్వాత కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ బాహుబలి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి అద్భుత పాత్రలతో దూసుకుపోతోంది. ఈమె తోటి హీరోయిన్లు చాలామంది ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. కానీ రమ్యకృష్ణ మాత్రం ఇంకా పవర్ఫుల్ పాత్రలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికీ ఈమెకు నాలుగు పదుల వయస్సు దాటి ఉన్నా 25 ఏళ్ల యువతి లా కనిపించడం అదృష్టమని చెప్పవచ్చు. అలాంటి రమ్యకృష్ణ ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో కొంతమంది పక్కలోకి రావాలని కూడా అడిగారట.

ఈ విషయాన్ని ఆమె డైరెక్ట్ గా చెప్పింది. ప్రస్తుత కాలంలో చాలామంది ఆడపిల్లలు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేసింది. కొంతమంది దర్శక, నిర్మాతలు ఇంటర్వ్యూలో  పక్కలోకి రావాలని అడుగుతున్నారని ఆమె కరాకండిగా చెప్పేసింది. ఈ విధంగా రమ్యకృష్ణ మాట్లాడడంతో  ఇంత పెద్ద హీరోయిన్ కే కాస్టింగ్ కౌచ్ తప్పలేదు మిగతా హీరోయిన్ల పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈమె విలన్ గా, తల్లిగా, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అద్భుతంగా నటిస్తూ దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: