
అలాగే హను రాఘవపూడి మొదటి సినిమా అందాల రాక్షసి .. 90 నాటి నాస్టాల్జిక్ నేపథ్యంలో సాగే స్టోరీ ఈ సినిమా ఎవరికి ప్రతిఫలం లేని లవ్ స్టోరీ గా తెరకెక్కింది .. ఇక ఈ సినిమాలో ప్రతిఫేం సంగీతం వాతావరణం ప్రేక్షకుడిని అందులో కలిపేసుకునే భావాన్ని చూపిస్తుంది .. ఈ అందాల రాక్షసి సినిమా ప్రేక్షకులు హృదయాలో చిరస్థాయిగా నిలిచిపోయే మరుదమైన ప్రేమ కథగా నిలిచిపోయింది .అలాగే ఆనంద్ రంగ దర్శకత్వంలో సిద్ధార్థ , శాలిని నటించిన లవ్ స్టోరీ చిత్రం ఓయ్ నికోలస్ స్పార్క్స్ ఎ వాక్ టు రిమెంబర్ నవల ఆధారంగా తెర్కక్కిన ఈ సినిమా ఎప్పుడు మర్చిపోలోని అనుభూతిని ఇస్తుంది .. అయితే ఈ సినిమా ఇన్ కంప్లీట్ అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది .. అలాగే గౌతమ్ తిన్నూరి దర్శకత్వం వహించిన మొదటి సినిమా మళ్లీ రావా .. ఈ సినిమాలో కార్తీక్ , అంజలి అనే చిన్నప్పటి ప్రేమికుల ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కింది సుమంత్ , ఆకాంక్ష సింగ్ జంటగా నటించిన ఈ సినిమా కూడా ఇన్ కంప్లీట్ ప్రేమ కథ అయినా కూడా ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం తెచ్చుకుంది .
అదే విధంగా హను రఘుపూడి దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సీతారామం కూడా 1964 నాటి కథతో వచ్చింది .. కాశ్మీర్ సరిహద్దుల్లో పనిచేస్తున్న అనాధ సైనిక అధికారి లెఫ్టినెంట్ రామ్ , సీతా మహాలక్ష్మి మధ్య జరిగిన ప్రేమ కథ ఈ కథ ఇన్ కంప్లీట్ కానీ ప్రేక్షకుల మనసులో మరుపురాని ఓ అందమైన కథగా చెరగని ముద్ర వేసుకుంది . అలాగే సందీప్ రాజ్ కలర్ ఫోటో కూడా అందమైన ప్రేమ కథను చూపిస్తూనే సమాజంలో ఉన్న సామాజిక సమస్యలను కూడా ప్రస్తావించింది .. సుహాస్ , చాందిని చౌదరిలపై దృష్టి సారించి ఈ సినిమా .. చర్మపు రంగు గురించి సామాజిక పక్షపాతాలను సవాల్ చేసింది .. ఇక ఈ సినిమా కూడా ప్రేమ కథ హృదయాలను కలిసివేసింది .. ఇది కూడా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే గొప్ప సినిమాల్లో ఒకటిగా స్థానం దక్కించుకుంది .