టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సుకుమార్ క్ దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇప్పటివరకు సుకుమార్ ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఒకటి , రెండు సినిమాలను మినహాయిస్తే అన్ని సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. దానితో ప్రస్తుతం సుకుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే సుకుమార్ ఆఖరుగా పుష్ప పార్ట్ 2 మూవీ కి దర్శకత్వం వహించాడు. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది.

మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే సుకుమర్ , చరణ్ తో తన తదుపరి మూవీ ని చేయనున్నట్లు అధికారికంగా ప్రకటనను విడుదల చేశాడు. ఆ మూవీ చరణ్ లో 17 వ మూవీ గా రూపొందనున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చరణ్ మూవీ ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ తన తదుపరి మూవీ ని సుకుమార్ టి కాకుండా వేరే దర్శకులతో చేయాలి అనే చరణ్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప లాంటి భారీ విజయం తర్వాత సుకుమార్ కూడా ఓ భారీ సినిమాను రూపొందించాలి అనే ఉద్దేశంలో ఉన్నట్లు , అందుకోసం ఒక అదిరిపోయే రేంజ్ స్టోరీ తో చరణ్ తో మూవీ ని రూపొందించాలి అనే నిర్ణయానికి సుకుమార్ వచ్చినట్లు , అందుకోసం చాలా సమయాన్ని తీసుకోవాలి అని కూడా సుకుమార్ అనుకుంటున్నాట్లు , అందుకే చరణ్ వేరే దర్శకులతో తన తదుపరి మూవీలను చేయనున్నట్లు ఆ తర్వాత సుకుమార్ , చరణ్ కాంబోలో మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: