తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి ధనుష్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునమూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా టీజర్ను విడుదల చేయడానికి అన్ని పనులను శర వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేయాలి అనే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు ,  మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ కనుక అద్భుతంగా ఉన్నట్లయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ మూవీ లో ధనుష్ హీరోగా నటిస్తూ ఉండడం , ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తూ ఉండడం , ఈ మూవీ కి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ  పై తెలుగు , తమిళ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: