చాలా సంవత్సరాల క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టి ఇప్పటికి కూడా అద్భుతమైన జోష్లో హీరోయిన్గా కెరియర్ను ముందుకు సాగిస్తున్న అతి కొద్ది మంది బ్యూటీలలో త్రిష ఒకరు. చాలా సంవత్సరాల క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టిన ఈమె తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లాంటి హీరోలతో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా ఈ తరం స్టార్ హీరోలు అయినటువంటి పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇకపోతే ఇప్పటికీ కూడా త్రిష అదిరిపోయే రేంజ్ లో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కమల్ హాసన్ హీరోగా రూపొందిన థగ్ లైఫ్  సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.

చాలా మంది హీరోయిన్లు చాలా కాలం నుండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ త్రిష మాత్రం చాలా కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంది కానీ. ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అలా త్రిష ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో బాగా టచ్ లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: