చాలా రోజుల నుండి మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణు సినిమా కన్నప్పని ట్రోల్ చేసుకుంటూ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఏ ఈవెంట్ కు వెళ్ళినా ఏ మీడియా సమావేశంలో పాల్గొన్నా కూడా విష్ణు తన కన్నప్ప మూవీ లో శివయ్య అని ఎలా పిలుస్తాడో అలా శివయ్య శివయ్య అంటూ పిలుస్తూ తన అన్నని పరోక్షంగా విమర్శలకు గురి చేస్తున్నాడు. అయితే గత కొద్ది రోజుల నుండి మంచు ఫ్యామిలీలో ఈ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అన్నను టార్గెట్ చేసిన తమ్ముడు మంచు మనోజ్ ఇలా ఆయనకు మండేలా ఎన్నో కామెంట్లు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా శివయ్యా అని అనడం గురించి అంతా నా తప్పే అన్నట్లుగా తప్పు తెలుసుకున్న మంచు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో క్షమాపణలు తెలియజేశారు. మరి ఇంతకీ మనోజ్ ఇన్ని రోజులు అంత కఠినంగా ఉండి ఇప్పుడు ఎందుకు అలా క్షమాపణలు తెలియజేశారు అనేది ఇప్పుడు చూద్దాం.

తాజాగా తన భైరవం మూవీ ప్రమోషన్ ఈవెంట్లో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. చాలా రోజుల నుండి నేను శివయ్య శివయ్య అంటూ కన్నప్ప మూవీ టీం ని వేధించాను. అయితే  మంచు విష్ణు తో నాకు పర్సనల్ గా గొడవలు ఉన్నాయి. విష్ణు నన్ను పర్సనల్ గా టార్చర్ చేయడం వల్లే అలా నేను ప్రతి ఈవెంట్లో శివయ్య అంటూ మాట్లాడాను.కానీ ఆ మాటలు అన్నందుకు ఆ తర్వాత చాలా బాధపడ్డాను. కేవలం పర్సనల్ గొడవల కోసం శివయ్య అని అనకుండా ఉండాల్సింది అని ఆ తర్వాత నాకు నేనే రియలైజ్ అయ్యి ఇప్పుడు కన్నప్ప టీం కి క్షమాపణలు చెప్పాలి అని నిర్ణయించుకున్నాను.ఇన్ని రోజులు కన్నప్ప మూవీలోని శివయ్య శివయ్య అంటూ మాట్లాడినందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఈ సినిమాలో ఎంతో పెద్ద స్టార్స్ అయినటువంటి మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్,కాజల్ వంటి వాళ్ళు నటిస్తున్నారు.

కానీ ఒక్క మంచు విష్ణు కోసం వీరందరూ కలిసి నటించిన సినిమాని అపహాస్యం చేయ్యడం నాకు నచ్చలేదు. అందుకే కన్నప్ప మూవీ టీం కి క్షమాపణలు తెలియజేస్తున్నాను. నేను అలా మాట్లాడడం వల్ల కన్నప్ప మూవీలో నటించిన ఇతర హీరో హీరోయిన్లు అభిమానులు చాలా హర్ట్ అయి ఉంటారని నేను భావిస్తున్నాను.అందుకే వాళ్ళందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను.ఎవరో ఒకరు చేసిన తప్పుకి అందరినీ భాద్యులని చేయడం ఇష్టం లేకే ఇలా కన్నప్ప మూవీ టీం కి క్షమాపణ తెలియజేస్తున్నాను అంటూ మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఇక తన భైరవం మూవీ మే 30న విడుదల కాబోతుండడంతో శివయ్య అనే పదాన్ని ట్రోల్ చేయడం వల్ల తన సినిమాకి కన్నప్ప మూవీలో నటించిన స్టార్ నటినటుల అభిమానుల వల్ల తన సినిమాకి ఎక్కడ దెబ్బ కొడుతుందోనని భయపడ్డ మంచు మనోజ్ ఇలా కన్నప్ప మూవీ యూనిట్ కి క్షమాపణలు చెప్పినట్టు కొంతమంది మాట్లాడుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: